బోరు బావులు
బోరు బావి ఘటన హోరుగ జూపుచు
వుత్సహించు గాని బుల్లి తెరలు
ముందె కీడు దలచి ముప్పును దెల్పగ
గ్రామ సీమ లందు గాంచ బోవు
నీటి కొరకు బోరు నిలుచుండి వేతురు
నీరు పడక పోతె నీరు గారి
పూనబోరు తిరిగి పూడిక సేయగ
మింగ నుంచు తారు మించి నోరు
గంగ తోడ జనులు గంపెడు నాశతో
దొలచి దొలచి నీరు దొరక బట్టి
బావి యెండి పోతె బద్ధక మొందుచు
నరక లోక మునకు నడుప గలరు
మంత్రి గణములన్ని మట్టిని కొల్చుచు
యెండు రంధ్ర ములను యేల గనవొ
యెన్ని జరుగుచున్న యేదియు జేయక
కఠిన చర్య లేవి కాన రావు
పసిమి బాల లచట పరుగులు పెట్టుచు
పాడు బావు లందు బడుచు నుండె
కలలు కల్ల లగుచు కనరాని లోకాల
కరుగు చుండె యెంత కష్ట మాయె
Comments
Post a Comment