చెడ్డవాడి అంతిమదినం
విలాసానికి చిరునామా
అతని ప్రవృత్తి!
ఆనందాన్ని వెతుక్కుటూ
పరిగెత్తడమే అతని నైజం!
మద్యం లో మునిగిపోతూ
మత్తులో తేలిపోతూ
పబ్బుల కోసం వెంపర్లాడుతూ
వేగాన్ని ఇష్టపడుతూ
అతివేగంగా కారు నడుపుతూ
అన్న మందలించినా
అమ్మ నిరసించినా
ఎవరు విమర్శించినా
లెక్కచేయని తెంపరితనం
అన్న ఆకాశ మంత ఎత్తున ఉంటే...
తమ్ముడు అన్నపేరు వాడుకుంటూ
పాతాళానికి పరుగుతీసాడు!
అధః పాతాళపు అంచులకు
అలవోకగా జారిపోయాడు!
ఆ రోజు ఆనందపు హద్దులు దాటి
అర్థరాత్రి వరకూ ములిగి తేలాడు!
వేగానికి భాష్యం చెబుతూ...
వాహనాన్ని నడిపాడు!
అతనికి తెలియదు...
కాలుడు అతన్ని వెంటాడుతున్నాడని!
మత్తు తలకెక్కి కారుని
రోడ్లపై పరుగుతీయుస్తుంటే...
ఇక క్షమించనంటూ విసుగెత్తిన విధి
అతనికి ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది!
అంతే..... ఇక ఏమీ లేదు!!
తనకేమయిందో తెలియక ముందే...
తనువును వదిలి వేగంగా...
వెళ్ళిపోయిందతడి ప్రాణం!!
అందరి అసహ్యాన్ని అందుకుని
అందరాని లోకాలకి వెళ్ళిపోయాడు!!
చెడిపోయే వాళ్ళకి అతనొక
పాఠ్యాంశం అయిపోయాడు!!
Comments
Post a Comment