మదపుటెద్దులు

పూలు కోయగబోకుమా పూలరంగ
నీవు నడిచెడు దారిలో నీలుగంగ
కనుల సుందర రూపును కనిన యంత
సొంత మెందుకు కావలె సొగసు నీకు

ఇంతి జాబిలి చందమై ఇంట నడువ
కంట గింపుగ తోచునా కనగ మీకు
కట్న కాసుల కోసమై కఠినులౌతు
హింస జేసిన ఎంతసహించగలదు

చీర చెంగును చూడంగ చీడ పురుగై
ఉఛ్ఛ నీచము లెరుగక ఉరకలెడుతు
మదపుటెద్దులదండులై మతులు జచ్చి
వెంట బోవుదు రేలనో వెంబడించి

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు