ఘన పతాకం
ఎగిరింది ఎగిరింది
ఘన పతాకం!
తెలుగు కవితా వైభవ
కీర్తి పతాకం!
సహస్ర కవులందరి
సమైక్య పతాకం!
పునర్వైభవ గీతి
ఆలాపనల మధ్య
సాహితీ సౌరభం
వెల్లి విరిసే వేళ
నవరస భావామృతాల
రుచులు ఆస్వాదిస్తూ
కవి హృదయముల యందు
రవి తేజమొలికించి
ఎగిరింది ఎగిరింది
ఘన పతాకం!
తెలుగు కవితా వైభవ
కీర్తి పతాకం!
Comments
Post a Comment