వాన మబ్బుల్ని స్వాగతిద్దాం

నిన్నటిదాకా...
ఉక్క పోతతో వేడెక్కిన వళ్ళు,
నేడు మరలా...
కుండపోతతో చల్లబడి సేదదీరింది

నిన్నటిదాకా....
బక్క చిక్కి డొక్కలెండిన పశువులు
నేడు
పొట్ట నిండా గుటకలేసి నీళ్ళు తాగాయి

నిన్నటిదాక ...
నల్లటి శిలాజాలై మారిన చెట్లు
నేడు
పచ్చని చీర ధరించాయి

ఈ సంతోషంలో ఏ మూల నుంచి వచ్చాయో...
కప్పలు బెక బెక మంటున్నాయి.

రెక్కలు టపటపా కొట్టుకుంటూ
పక్షులు సందడి చేస్తున్నాయి.

పూలు గుభాలించి
కమ్మని గంధాలు జల్లాయి.

ఈ సంతోషం ఇలాగే కొనసాగి
పుడమి తల్లి పులకింతలతో...
పచ్చిక బయళ్ళతో...
పచ్చని పంటలతో...
జలకళతో...
పారే నదులతో...
జారే జలపాతాలతో...
రమణీయ ప్రకృతి కాంత
అందచందాలను చూస్తూ...
నేత్రానందమమౌతూ...
భావకవులకే కాదు...
నేల పై పుట్టిన ప్రతీ
ప్రాణ పరమాణువుకీ...
శుభములు కలగాలని
ఆశతో...వాన మబ్బుల్ని
సాదరంగా స్వాగతిద్దాం!!


Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు