జాడ్యం
భిక్షం వెయ్యలా! వద్దా!
అనే ధర్మ సందేహం
ఎప్పుడూ నన్ను వెంటాడుతుంది!
పసిపిల్లడిని ఎత్తుకుని
దీనంగా చూసే ఆమె కళ్ళని
చూసినపుడు...
రెండు భావాలు ఒకేసారి
పరస్పర యుధ్ధం చేస్తాయి!
ఆమె మోసపోయిన స్త్రీ అని జాలి!
కాదేమో బిక్షమాడే కళాకారిణి ఏమో
అనే అనుమానం...
ఒకదాని వెంట ఒకటి తలెత్తుతాయి!
ధర్మాసుపత్రి నుండి సంగ్రహించి
యాచక వృత్తికి వాడుకునే
నీచ ప్రవృత్తి ఒక వాడుకగా మారింది!
తనకు దారిలేనపుడు
పిల్లల్ని కంటూ తిరిగే స్త్రీ ఉంటుందా!
అనిపిస్తుంది...
నగరంలో ఈ మధ్య ఎటుచూసినా
బిక్షాటన ఒక జాడ్యంగా కనిపిస్తోంది!
ధర్మం చెయ్యటం వలన
ఈ జాడ్యం పెరుగుతోందే గానీ...
తరగటం లేదు!
ఈ జాడ్యానికి మందు ఏది?
గుండె రాయి చేసుకుని...
దానం చెయ్యక పోవటమా?
కరిగి నీరై ఐదో పదో చదివించడమా?
లేదా ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో
భిక్షాటనను నిషేదించి
పునరావాసం కల్పించటమా?
ఏది మందు? ఏది మార్గం?
సామాన్యులైన మనం
నిత్యం ఈ జాడ్యాన్ని చూస్తూ...
అలవాటు పడి...
శిలలుగా మారిపోతున్నాం!!
Comments
Post a Comment