నేను అనే విషయం
నేను నేనంటావు
నాది నాదంటావు
నీవెవవరివో తెలుసుకోవు
నీదేమిటో ఎరుగలేవు
నీవు ఉన్నంత వరకు
నీ దేహమే అది
నీవు విడిచిన పిదప
నిలువనే లేదది
నాది నాదను చింత
దేముడిచ్చిన గుణము
లేనిచో జగమంత
అస్త వ్యస్తమురా
పరమాత్మ నుండి విడు
పరమాణువులమే మనము
మనము మనదను తలవ
మరు మెట్టు యగునురా
నా మనిషి, నా గ్రూపు
నావాళ్ళు అందువు
ఆ గుంపులో నీవు
ఉన్నంత వరకెరా
ఆత్మ పరమాత్మలో నీవు
ఐక్యమయ్యే వరకు
నా అనే విషయంబు
వదిలి పెట్టదురా
పరమాత్మ ఐక్యతకు
భక్తి యొక్కటె కాదు
నీ తనువు, నీ మనసు
నీ కాల మంతయూ
కర్తవ్య నిర్వహణను
మెలగవలె హితుడా
పరమాత్మ ఐక్యతకు
పరమ సేవా ధర్మ
నిరతియే మార్గంబు
తెలుసుకో హితుడా
మన నుండి పరమునకు
మార్గమదియే హితుడ
భాగవత సారమిది
తెలుసుకో నరుడా!
Comments
Post a Comment