గోవ్యధ
వాడి వదలివేయు వాహనమదికాదు
యినుప తుక్కు కాదు యిలను గోవు
పాలు నేయి నిచ్చు పావన దేవత
పాడి ఎరువు లిచ్చు పంటచేల
గంగి గోవు జాతి గర్జింపు లెరుగదు
మేలు చేయు గాని మేకు కాదు
తాను సేవ జేసి తనసంతతినియిచ్చి
దేశ సేవ కొరకు దేహ మొసగు
ఏరు దాటి వీరు ఏమైన సేతుర
మనసు నందు ఇంత మమత లేద
తల్లి వంటి గోవు తల్లడిలుచుపోతె
మూగ బోయె నేల మూఢ జగతి
Comments
Post a Comment