అక్షరం

అక్షరం ఒక ఆయుధం
రక్త రహిత పోరాటంలో...

అక్షరం ఒక సాధనం
సమాజ వికాస నిర్మాణంలో...

అక్షరం ఒక శాసనం
చట్టమునకు చేతన మందించుటలో...

అక్షరం ఒక సోపానం
ప్రగతిని సాధించుటలో...

అక్షరం ఒక ఔషధం
నైరాశ్యమనే రోగానికి ఉపశమనంలో...

అక్షరం ఒక విస్పోటనం
కలకలం సృష్టించుటలో...

అక్షరం అమృతాన్నే కాదు!
హాలాహలాన్నీ చిందిస్తుంది...

అక్షరాన్ని మంచికోసం వాడితే...
మంచి చేస్తుంది!!
చెడు కోసం వాడితే...
చేటు తెస్తుంది!!

ఓ కవీ అక్షరాన్ని బాధ్యతగా వాడు!!
అవి సూర్య కిరణాలై...
జగతికి వెలుగు నిస్తాయి!!

మరణించే ఓ మనిషీ!
అక్షరానికి మరణం లేదు!!
అఖండ జ్యోతిగ వెలుగుతుంది!!
అజరామరమై నిలుస్తుంది!!
నీవు మరణించినా...
అది నిన్ను శాశ్వతముగా నిల్పుతుంది!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు