తెలుగు కవితా వైభవం

తెలుగు కవితా వైభవం!!
తెలుగు కవితా వైభవం!!
జయము జయము
జయము జయము
తెలుగు కవుల వైభవం!!

నన్నయ్య తిక్కన... ఎర్రప్రెగ్గడ...
పాల్కురికి పోతన శ్రీనాథులు...
ధాశరథి కృష్ణశాస్త్రి శ్రీశ్రీ శేషేంద్ర
సినారె కాలోజీ తిరునగరిల వైభవం!!

తెలుగు కవితా వైభవం!!
తెలుగు కవితా వైభవం!!
జయము జయము
జయము జయము
తెలుగు కవుల వైభవం!!

విశ్వనాధ, రాయప్రోలు...
గురజాడ, జాషువా వెల్దన్డ
బిరుదరాజ, నేదునూరి
నాయనిలు... ఎందరెందరో...
మహా కవుల వైభవం!!
తెలుగు కీర్తి వైభవం!!

తెలుగు కవితా వైభవం!!
తెలుగు కవితా వైభవం!!
జయము జయము
జయము జయము
తెలుగు కవుల వైభవం!!

మొల్లమాంబ... రంగాజమ్మ...
తరిగొండ వెంగమాంబ...
తాళ్ళపాక తిమ్మక్క
ముద్దు పళని... ఎందరెందరో...
కవయిత్రుల వైభవం
తెలుగు కవుల వైభవం

తెలుగు కవితా వైభవం!!
తెలుగు కవితా వైభవం!!
జయము జయము
జయము జయము
తెలుగు కవుల వైభవం!!

వచన కవితలు... పద్యకవితలు...
గేయకవిత, నానీలు,
గజల్, రెక్కలు...
కవన గుళికలు...
మీగడ తరకల వంటి
కవితా ప్రక్రియ లెన్నో...
పూలమాలగా కూర్చిన
కవిత వైభవం!!

తెలుగు కవితా వైభవం!!
తెలుగు కవితా వైభవం!!
జయము జయము
జయము జయము
తెలుగు కవుల  వైభవం!!

భావి కవులకు...
స్ఫూర్తి నింపుతు...
సహస్ర సత్ర యాగము
చేయుచుంటిమి!!
రవీంద్ర స్వప్నమే...
కవీంద్ర స్వప్నమై...
సహస్ర కవిత సౌరభం
పరిమళించెను!!
కవిమిత్రులు కవిరత్నలు
కవిభూషణలు... కవి చక్రవర్తులు...
సరస్వతీ పుత్రులు
ఎగరేయు పతాకం...
తెలుగు వైభవాన్ని చాటు
కీర్తి పతాకం... ఎగిరిందీ! ఎగిరిందీ!
ఎగిరిందీ తెలుగు కవిత
కీర్తి పతాకం!!
మన కీర్తి పతాకం!!
మన కీర్తి పతాకం!!

జై తెలుగు కవితా వైభవం!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు