సినారె కి నివాళి
ఒక కలం ఆగింది!
అది ఎన్నో కలములను
కదిలించిన మహా కలం!
కవితా వ్యవసాయ భూమిని
భావనల హలం పట్టి దున్ని
రత్నాల వంటి కవితలను
పండించిన కర్షక రవి
పడమటి సంధ్యకు
జారి అస్తమించెనా!
"ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలలు!
ఇన్ని మమతలు గీతికలైతే
ఎందుకు వేరే కోయిలలు!"
అని ప్రశ్నించిన విశ్వంభరుడు
విశ్వనాధుని చెంతకు వెళ్ళి పోయనా!
తెలుగు సాహిత్య చరిత్రలో
శాశ్వత పుటల నిల్చిన భావకుడు
మరి యికలేడా! కాదు కాదు!
వేల మంది హృదయాలలో
సూర్యుడులా ఉదయించేందుకు
భూమిపై అస్తమించాడు!!
అభిమానుల నివాళి అందుకుంటూ....
నవ కవుల కలంలో మెరుపై చరిస్తాడు
నవ్య రీతుల కవితలను అందిస్తాడు!!
Comments
Post a Comment