సాహితీ నవ కేతనం
పల్లవిll
ఎగిరె ఎగిరే కేతనం!!
సాహితీ నవ కేతనం!!
తెలుగు కవితా వైభవాన్ని
చాటి చెప్పే కేతనం!
ఎగిరె ఎగిరే కేతనం!!
సాహితీ నవ కేతనం!!
చరణంll
అక్షరాల జ్యోతులను
అరచేత బట్టితిమందరం!
లక్ష్యసాధన ఎంచి
రచనల క్రతువు చేసేమందరం!
వజ్రఖడ్గము వంటి కవితల
ప్రజ్వలించే పద్య విదితల
సత్రయాగము చేయుచుంటిమి
సహస్ర కవులం ఒక్కటై!!
ఎగిరె ఎగిరే కేతనం
సాహితీ నవకేతనంll
భావనది పుష్కరిణిలో
పుణ్యస్నానం చేస్తిమి!
జీవకవితలనెన్నియో
తెప్పలుగ తేలిస్తిమి!
వ్యకిగతములు మరచి మనము
వ్యక్తులం ఒకటైతిమి!
సహస్ర కవితా సౌరభానికి
పుష్ప రాజములైతిమి!
సహస్ర వాణి మధురిమకు
కవి కోకిలలు మనమైతిమి!
ఎగిరె ఎగిరే కేతనం!!
సాహితీ నవకేతనం!!
తెలుగు కవితా వైభవాన్ని
చాటిచెప్పే కేతనం!
ఎగిరె ఎగిరే కేతనం!!
సాహితీ నవకేతనం!!
Comments
Post a Comment