ఆవకాయామృతం
అమరేందృని అమృతమే
అసూయ పడకపోవునా
అమరులంత దిగి వచ్చి
అడిగి తినకపోవునా
అబ్బురమే ఆవకాయ
అధరము లదరగజేసెడి
మహారుచికి మహోన్నతి
వద్దనగలమే
దీని రుచి మరిగిన వారలము
వడ్డనలో లేకుంటే
అలిగి వెళ్ళకుంటామా
దీనిని తలవంగానే
లాలాజల గ్రంధులన్ని
స్రవించవా నాలుకపై
ఊటలు తేటలుగా!!
ఊరగాయ ఆవకాయ
వెల్లుల్లితొ మహారుచి!!
బెల్లముతో భలే రుచి!!
Comments
Post a Comment