పవిత్ర మాసము

సీసముll
నామాలు యెన్నైన నాశంబు లేనట్టి
పరదైవ మొక్కటే పావనంబు
రూపాలు వేరైన పాపాలు హరియించి
ముక్తిని యిచ్చేటి శక్తి యొకటె
మదినిండ నల్లాను మంచిగా తలచిన
పరమేశు డొకడని పల్క నొకటె
ప్రార్ధన చేయంగ ప్రాభవ మొసగెడి
రంజాను మాసంబు రమ్యమౌను

ఆll
భక్తి మనసు నిల్పి భగవంతు ధ్యానము
నియమనిష్ట జేయ నిగ్రహమున
మతముకేనతీత మగునీశుని కరుణ
సకలజనుల కతనె సత్యవ్రతుడు

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు