జీవ జంఝాటం
నీది నాదను వాదమే నీతి యనుచు
లోకనాధుని నటనలో లోతెరుగము
వచ్చి పోయెడి వారిమే వంతులగుచు
చివరి కేదియు రాదులే చింత విడుము
తోలు బొమ్మల యాటలో తోడుఎవరు
కీలు వీలగు నందాక కీత లిడుచు
గూటి గువ్వలు గుట్టుగా గూడు విడువ
పీకులాటలు వీడుచూ పీనుగగును
దారి తెలిసిన సుజనుడే దాట గలడు
తావు త్రెంచుకు పోవు మేథావి యగును
తామరాకుకు బిందువై తాకి యుండి
తనువు పైతన వారిపై తపన విడును
Comments
Post a Comment