తెలుగు కవితా వైభవం
పల్లవిll
తెలుగు కవితా వైభవం
ఇది తెలుగు కవితా వైభవం
సహస్ర కవులు స్వాగతించిన
తెలుగు కవితా వైభవం
ఇది సత్రయాగపు వైభవం
చరణంll
ఎగురుచున్నది స్వేఛ్ఛగా
భావకవితా కేతనం
సాహితీ విజయానికి
సత్యమౌ సంకేతనం
తెలుగు కవితా వైభవం
ఇది తెలుగు కవితా వైభవం
చరణంll
సమత మమతల రూపమై
ఇది మేలి మెరుపులు దిద్దును
ఒకరినొకరిని కూర్చుతూ
ఇది మేటి మేరువు మించును
సఫలమాయె రవీంద్ర స్వప్నము
సార్థకం చరితార్థకం!
ఇది సార్థకం చరితార్థకం!!
తెలుగు కవితా వైభవం!
ఇది తెలుగు కవితా వైభవం!!
ఇది తెలుగు కవితా వైభవం!!
Comments
Post a Comment