Posts

Showing posts from May, 2017

విశ్రమ విప్లవం

రైతాంగ మొక్కటై నారు వెయ్యకపోత పూటపని కూలీలు వెట్టి పనులొదిలేస్తె పాడి పని కార్మికులు వేరు పని మొదలెడితె పాలేరులందరూ పనిని విశ్రమిస్తె కుమ్మరులు, కమ్మరులు, మంగల...

దేవత

కోడి కూసేవేళ లేచి లేవంగానె దొడ్లు వాకిలి తుడిచి కళ్ళాబులను జల్లి ముగ్గు ముంగిట వేసి గదులు శుభ్రం చేసి అంట్లగిన్నెలు తోమి తేయాకు పాలను తీయగా అందించి కంపు గుడ్డలు ...

పొగాకు చేసే మాయాజాలం

పొగచేసే మాయాజాలం వినరండీ వినరండీ! తగలేసే పెట్టెల సాక్షిగ చేబుతామరి ఈ పూట!! గాలిలోకి ఎగరేసి నోటితోటి అందుకుని ఒక గీటుతోటె వెలిగించే చలాకీల క్రీడాజాలం! అర ముక్కను వి...

నానీలు - 5

ప్రేమ కోసం జీవిస్తాడట సిగరెట్ల కోసం పడి చస్తాడట ధూమపానం వద్దన్నాను అతడి మనోభావం దెబ్బతింది తండ్రిని మించిన కొడుకులు ధూమపాన విశారదులు వైద్యం చెయ్యడం అతని వృత్త...

నానీలు 4 - పొగబతుకు

పొగ నువ్వు తాగుతున్నావు గానీ సెగ మాకు తగులుతోంది ఇంటి ఇంటికీ పొగ గొట్టాలు ఫ్యాక్టరీలన్నీ దిగదుడుపే ఇల్లు నల్లబడితే ఏడుస్తున్నావు గానీ శ్వాశ తగలబడినా తెలీదుగా ...

విశ్వ విద్యాలయం

విశ్వమనే ఈ విద్యాలయంలో మేమింకా చదువుతూనే ఉన్నాం... నువ్వు ప్రతిభ గల విద్యార్థివి అన్ని సబ్జక్టులూ పాసయ్యావు! డిప్లమో చేసావు డాక్టరేట్ సాధించావు! ఇక నీకు చదు వు పూర్...

దశావతారుడు దాసరి

పామరుల పాట నీదే పండితుల మాట నీదే చిత్రలోక సూర్యుడు నీవే ఛాయాగ్రహ శక్తివి  నీవే మహా నటుల సాంగత్యంలో మంచి నటుడివయ్యావు మరి ఎందరో తారలకు చంద్రుడిగా తోడయ్యావు అక్కి...

నిమిత్తమాత్రులం

ఒకరు ముందు ఒకరు వెనుక కడుపులో పుట్టి నేలపై పాకి కాళ్ళతో నడిచి బ్రతుకంతా తిరిగి... అలిసినా అలవక పోయినా... నిదురనేది రాకపోయినా... నిదురపుచ్చే కాలదేవత కంటిమీదే ఉంటుంది!! రె...

నానీలు 4 - ఫ్యాషన్

పిచ్చుక గూడూ గుర్రపుతోకా వచ్చాక వాలు జడ విదేశాలెళ్ళింది నిక్కరులో సిగ్గు లేదు గాని చీరకట్టుకోమంటే సిగ్గు పడింది ముష్టివాడు జాలి పడ్డాడు చిరిగిన జీన్సు లో అమ్మ...

నానీలు - కాలుష్యం

ఎటు చూసినా కారు మేఘలే బస్సులకి ఆటోలకి అడ్డే లేదు చెట్లు నల్లబడి నీళ్ళు పచ్చబడ్డాయి అభివృధ్ధి చెందాం కదా కాలుష్యం అంటే సూర్యుడికీ భయమే మబ్బుల మాస్కు వేసుకున్నా...

అవసరానికి మారదు

అవసరాని మార్చుకునేది రాజ్యాంగ ధర్మం కావచ్చు కానీ నైతిక ధర్మం కాకూడదు! అవసరానికి మార్చుకునేవి పార్టీ సిద్ధాంతాలు కావచ్చు కానీ వ్యక్తిగత సిద్ధాంతాలు కాకూడదు! అవస...

దైవత్వమే ధర్మం

నువు పూజించే రామునిది ఏ కులం! నువు పూజించే కృష్ణునిది ఏ కులం! నువు పూజించే శివునిది ఏ కులం! నువు పూజించే శ్రీహరిది ఏ కులం! నువు పూజించే శక్తిది ఏ కులం! నువు పూజించే హను...

పరువు కోసం

కులం అంటే భయం కుల బంధువులంటే భయం కుల సంకరమంటే భయం తన ఇంట్లో తప్పు జరిగితే పరువు కులంలో పోతుందని భయం పరువుకోసం తమ ప్రాణాలు నైనా లెక్క చేయరు కొందరు! పరువు కోసం పిల్లల ప...

నానీలు 3 - ధర్డు పర్సన్

టులెట్ బోర్డు గుండెకి ఉందేమో అంతమంది వచ్చెళ్తున్నారు ఇంటాఆవిడ అలిగిందంట పాపం ఉపవాసం చేస్తున్నాడు తాత మీసాల పొడవు చూసి మనవడి రోషాలు పెరిగినట్టు ప్రేయసి కోసం తప...

రైతు సెగ - నానీలు 2

సబ్సిడీ మీద ఇప్పించేటివి విత్తనాలా మరి ఉరి కొయ్యలా! మిర్చి రైతుకి మంట ఎక్కితే ఘాటు కొట్టింది ప్రభుత్వానికి! చెరువు కట్ట తెగి పోయింది ధర గిట్టక పోయే సరికి! అగ్ని శి...

నానీలు - రైతు జీవితం

1. విత్తుని పండించడం     తెలుసు గానీ...     విత్తం పండిచడం     తెలియదే!!       2  వ్యవసాయం     చేసి ఇస్తాడు     వ్యయ సాయం     ఎవరిస్తారు!! 3.  మేఘం      వర్షించక పోతే      తానే వర్...

పంక్తిలో ఒకనిగా

భక్తి పాడగలేను రక్తి వీడగలేను ముక్తి మార్గమునందు నడచిపోలేను వ్యక్తిగా నాలోని వ్యక్తిత్వమును జూపి వ్యక్తీకరించగల ఘనుడనే కాను! యుక్తితో నాకున్న శక్తితో తగినంత భ...

దించితే దిగుతారు

నీ కంటి నీటితో పండించినావా! నీ చెమట చుక్కతో సాగుచేసావా! నీ కండ్లు విప్పార్చి కాపు కాశావా! నీ కండ కరిగించి నూర్పులూడ్చావా! నీ శ్రమను దోచేటి దొంగలున్నారనీ నీ ఋణం పెంచే...

మా భువిని కాపాడ తరలి రారండి

ధరణి వీడితివేమొ --- ధర్మమా నీవు! నేల వీడితివేమొ --- న్యాయమా నీవు! భువిన నలిగినావు --- శాంతమా నీవు! దైవమే దిగివచ్చి రక్షించె మిమ్ము! శ్రీ హరుని రూపమున యుగయుగమునందు! తాను నాటిన ...

ఇనుము - మినుము

ఇనప గుళ్ళ వంటి మినప గుళ్ళుండగా ఇంగ్లీషు ఫుడ్డంటు ఏడుపేల! మినప పుణుకులు వదలి మంచూరియా అంటు చైనీసు తిండికై మోజు ఏల! మినప పిండితొ చేయు ఇడ్లీలు కుడుములకు నార్తు ఫుడ్డు ...

తెలుగు భాషామృతం

త్యాగరాజ కృతుల తీయందనాలను వినితరించవయ్య తెలుగువాడ! రామదాసు భక్తి రసరమ్య కీర్తనలు ఆలకించవయ్య తెలుగువాడ! అన్నమాచార్యుని భక్తి గేయములన్ని సేకరించవయ్య తెలుగువాడ...

దీపశిఖ

చీకటిలో వెలిగే చిరుదీపమా చిరుగాలికి నీ పై పరిహాసమా నీ రెపరెపలను చూసి నిన్ను నిలకడ చేయాలని అరచేతుల మధ్య నీకు రక్షణనివ్వాలని తపియించే హృదయంతో నీ దరి చేరే లోపు ఎన్న...

నరమేధం జరుగుతోంది

నరమేధం జరుగుతోంది! నరమేధం జరుగుతోంది! నరరూపంలో రక్కసి జడలు విప్పి తిరుగుతోంది!! తన మతమే ధరణిపైన రాజ్యం చెయ్యాలంటూ... పరమత సహనం చచ్చిన ఉగ్రమూక పిశాచాలు కత్తులతో కుత్త...

మన మౌనం

భార్యాభర్తల నడుమ... మౌనం అహంకారం తల్లీ పిల్లల నడుమ... మౌనం అసాధారణం అపరిచయస్తుల మధ్య... మౌనం అలంకారం ఉపన్యాస వేదిక ఎదుట... మౌనం అవసరం తగని ప్రశ్నలెదురైతే... మౌనం అత్యవసరం భా...

సిరుల లక్ష్మీ రూపిణి

చిలక పలుకుల కలికి సింగారమై నడిచిందిలే! సిగ్గు మొగ్గలు పూచి బుగ్గలు మందార కాంతులు చిందెలే! కళ్యాణ వేదిక దారిన సన్నాయి మేళపు తోడున తళుకులొలికే చీర చెంగును వడ్డాణము...

కలకంటి కన్నీరొలికెను

కలకంటి కన్నీరొలికెను!! కలకంటి కన్నీరొలికెను!! ఇంటి పేరే సాక్షిగా... తన గుండె గాయం సాక్షిగా అత్త మామలు గుచ్చు తీరు! ఆడపడుచులు పొడుచు తీరు! చెవిన చెప్పుడు మాట వింటూ రెచ్చ...

ఆడవారితో షాపింగ్

నేను చేసిన నేరమేమిటి! నా కెందుకీ శిక్ష ! ఏడ్వలేక నిలుచునే ఈ దుస్తితి నా కేనా...! అని మూల నిల్చున్న నా వైపు దీనంగా చూస్తున్నాడొక వ్యక్తి! నా కష్టమే అతడి కష్టమూ అని అతని కళ్...

మన సంప్రదాయపు వంటలు

అయ్యో మన సంప్రదాయపు వంటలేమై పోయెనో! నేతి బూరెలు అరిశ లడ్లు కానరాకనె పోయెను! పులిహోర చక్కెర పొంగలెక్కడ విందు దొరకక పోయెను! ముద్దపప్పు గుత్తివంకాయ్ పులుసు రుచులే పో...

గీత చెప్పిన ధ్యాన యోగము

గీత చెప్పిన ధ్యానయోగము రోగమన్నది ఎవడురా! సైన్సు చేయని రోగవ్యాప్తకి స్థలము ఏదో చెప్పరా! స్వఛ్ఛమైన గాలి నీరుల జగతి రూపము మార్చుతూ కాలుష్యకోరల చిక్కి ఉంచిన ఘనత ఎవరి...

కవి కోకిలవై వర్ధిల్లు

నస పెట్టకు నస పెట్టకు నీ కవితలెవరు వినరని! గుస పెట్టకు గుస పెట్టకు వీరంతా ఇంతేనని! బుస కొట్టకు బుసకొట్టకు వారెవరు కవులు కారని! రుసరుసగా చూడకు ఇది తగిన స్థలము కాదని! వ...

ధన వైరాగ్యం

వల్లకాదు ఈ భాగ్యాలని వల్లకాటి వైరాగ్యాలు! జేబు బరువు తగ్గంగానే చెప్పలేని నైరాశ్యాలు! ఉన్నప్పుడు దాచుకోమని వినిఉన్నా హిత వాక్యాలు! పెడచెవిన పెట్టెస్తాము వచ్చువర...

ఓ మధువా

ఓ మధువా! నీకు జోహార్లు! తాగేవాడికి తలలో దూరి తతంగమంతా నడిపిస్తావు! ఓ మధువా! నీకు జోహార్లు! వాగేవాడికి నాలుక తిప్పి పచ్చి నిజాలు పలికిస్తావు! ఓ మధువా! నీకు జోహార్లు! చావ...

మోక్ష సాధకుడు

పట్టి చదివిన వాడె ఉత్తీర్ణుడౌతాడు! పట్టు విడువని వాడె గెలుపు సాధిస్తాడు! పట్టుకొని చూడు ఆ పరమాత్మ పాదాలు! పట్టు విడువకుండ శరణు వేడు! పట్టు వస్త్రములేవి భక్తి కాబోవ...

పరమ సోపానం

గంపెడూ కోరికలు తలపైకి ఎత్తుకుని గతపాప కర్మలను చంకలో పెట్టకుని గంగ మునుగంగనే పాపహరణము కాదు గంగ సుతుడై కూడ ఫలమనుభవించెను కర్మబంధాలలో బంధీవి అయినావు! నిష్కల్మషము ...

కవులంటే ముద్దు

ఆకాశం విరిగి పడుతున్నట్లు నేల కృంగిపోతున్నట్లు సముద్రాలు ముంచెత్తుచున్నట్లు పర్వతాలు బ్రద్దలైనట్లు పిడుగులు పడుచున్నట్లు జడివాన కురుస్తున్నట్లు పెనుగాలి వ...

అభినందనలు

అభినందించే వారికి అభివందనాలు అభినందించలేని వారికి అభినందనలు! అభిమానించే వారికి అభిషేకములు! అభిముఖమైన వారికి అభివాదములు! అభిప్రాయ బేధాలెన్ని ఉన్నా! అభినయం చూపే ...

దేముని వేదన

నేను దేముడ్ని! ఈ శిలలో నన్ను ఆవాహన చేసి భక్తులకు దీవెన లీయమన్నారు! వేలాదిగా వస్తున్న భక్తులను ఈ శిల నుండి దీవిస్తున్నాను! ఈ అర్చక స్వాములు అభిషేకాల పేరుతో నిత్యం నన...

గొప్పదనం సత్యం వీక్షిస్తుంది!

గొప్పదనం చెప్పుకుంటే రాదు గొప్పదనం చెప్పించుకుంటే రాదు గొప్ప కోసం చేస్తే రాదు గొప్పదనం నటిస్తే రాదు వ్యక్తిత్వాన్ని వికసింప జేసుకుంటే... ఆత్మ ప్రబోధానికి కట్టుబ...

కవిగా ఎదగాలంటే

పదవిన్న్యాసాలు చెయ్యాలంటే... నిఘంటువు పఠించాల్సిందే! కావ్యాలు చదవాల్సిందే! కవుల బాణీలను పట్టాల్సిందే! పద్యశతకాలు వ్రాయాలంటే... ఛందస్సు నేర్వాల్సిందే! పద్య రచనను వి...