ఒరేయ్ వెర్రి వాజమ్మలూ!
ఒరేయ్ వెర్రి వాజమ్మలూ!
అతి తెలివి మూర్ఖులూ!
చూపకండర్రా మీ వాచల్య బుద్ధులు!!
యోగాసనాలన్ని వేస్టు అంటారు!
డైటింగు వర్కౌట్లు ఎందుకంటారు!
వళ్ళు కదపాలేరు, కాళ్ళు దులపాలేరు!
కూర్చున్న కుర్చీకి అంటుకుని పోతారు!
కష్టపడి ఎందుకీ కొవ్వు కరిగించడం
దోమ కుట్టావచ్చు, బస్సు ఢీ కొట్టచ్చు
చావు ఎట్టాగైన వచ్చి చచ్చంటూ...
వెర్రి వైరాగ్యాలు వల్లె వేస్తుంటారు!
మెదడు మోకాలిలో పనిచేయు బాబులూ
చావు ఎట్టాగైన వచ్చి చచ్చేటపుడు
కష్టపడి డిగ్రీలు సాధింతురెందుకోయ్!
ఉద్యోగ వ్యాపార వ్యర్ధ శ్రమలెందుకోయ్!
మోడరన్ ఋషులుగా గడ్డాలు పెంచుకుని,
రమ్ము, జిన్నూ తాగి
దమ్ము పొగ బిగ లాగి
చికెను బిర్యానీలు,
కేకులు, స్నేకులూ
మెక్కుతూ కూర్చోండి!
కొవ్వెక్కి కూర్చోండి!
లావెక్కి బజ్జోండి!
మీ గుండె గదిలోన నొప్పి వచ్చేదాక!
మీ శ్వాశకోశాల ఊపిరాగేదాక!
మీ కిడ్నీల కీళ్ళపని ఆగిపోయేదాక!
నవ్వి ఇకిలించండి యోగాసనాలను!
చులకనగ చూడండి డైటు జిమ్ములను!
మోకాలిలో తెలివి అరికాలికొచ్చాక
అరికాలిలో మెదడు చెప్పులో దూరాక
అరిచి గీ పెట్టనా ఆరోగ్యమిక రాదు!
ప్రివెన్షన్ బెటరు దన్ క్యూరన్న నానుడి
చదివి చచ్చారుగా ఇంగ్లీషు చదువులో!
మీ ఆసనంలోన ముళ్ళు చేరేదాక
ఆసనాల విలువ చేరి చెవికెక్కదు!
వ్యాయామముల మేలు మెదడులో కెక్కదు!
Comments
Post a Comment