ధన వైరాగ్యం
వల్లకాదు ఈ భాగ్యాలని
వల్లకాటి వైరాగ్యాలు!
జేబు బరువు తగ్గంగానే
చెప్పలేని నైరాశ్యాలు!
ఉన్నప్పుడు దాచుకోమని
వినిఉన్నా హిత వాక్యాలు!
పెడచెవిన పెట్టెస్తాము
వచ్చువరకు వార్ధక్యాలు!
అదుపులేని ఖర్చులు చేస్తూ
అందుకున్న సుఖ సౌఖ్యాలు!
ఆఖరు దశ చేరేసరికి
ఆపలేము ఆ దుఃఖాలు!
Comments
Post a Comment