గ్రామాలు జాగ్రత్త
పరిశ్రమలు వచ్చేస్తున్నాయ్!
పంట భూములు జాగ్రత్త!
నగరాలు వ్యాపిస్తున్నాయ్!
చెరువు, చేలు జాగ్రత్త!
జల యజ్ఞం జరుగుతు ఉంది!
గ్రామాలు జాగ్రత్త!
రియలెస్టేట్ నోరు తెరిస్తే
ఎకరాలే ఎగిరిపోతవి!
రైతన్నలు రోజు కూలిలై
వలసలు పోవలసి వస్తది!
గ్రామాలు ఈ దేశానికి
పట్టుకొమ్మలంటూ పొగిడి,
పట్టుకు పోతున్నారయ్యో
సుఖశాంతులు మూటలు గట్టి!!
Comments
Post a Comment