విశ్వ విద్యాలయం
విశ్వమనే ఈ విద్యాలయంలో
మేమింకా చదువుతూనే ఉన్నాం...
నువ్వు ప్రతిభ గల విద్యార్థివి
అన్ని సబ్జక్టులూ పాసయ్యావు!
డిప్లమో చేసావు డాక్టరేట్ సాధించావు!
ఇక నీకు చదువు పూర్తి అయ్యిందని
పై లోకాల్లో ఉద్యోగం కోసం
ప్రయాణమై వెళ్తున్నావు!!
నీ జూనియర్లమైన మేము
ఇంకా ఉత్తీర్ణులు కాని...
నీ తోటి విద్యర్థులతో కలసి
నీకు వీడ్కోలు చెప్తున్నాం!!
ఈ విశ్వవిద్యాలయంలో
మా సమయం వచ్చే వరకూ
మాకు ఉండక తప్పదు!!
నువ్వు మాకందించిన అనుభవాన్ని
పాఠాలు గా నేర్చి పైకి వస్తాము!!
Comments
Post a Comment