వేడి వేడి పకోడి
వేడి వేడి పకోడి!
ఉల్లి సెనగ పకోడి!
నూనెలోన వేగుతూనె
ఊరించే పకోడి!
సందెవేళ తిండి అంటె
గుర్తొచ్చే పకోడి!
వానజల్లు పడుతు ఉంటె
మురిపించే పకోడి!
డైటుగోల మరపించే
ప్లేటు నిండ పకోడి!
ఇంటిల్లిపాది పడిచచ్చే
పసందైన పకోడి!
తినిపెడదాం రండి!
దీని పనిపడదాం రండి!
Comments
Post a Comment