సమతా విపంచి
కాదన్నదెవరు...
స్త్రీ సౌందర్య రాశియే!
ఖండించేదెవరు...
పురుషుడూ సుందరుడె!
ప్రేమాకర్షణలు
స్త్రీ పురుష బంధాలు
ప్రకృతి సహజాలు
నిత్య సత్యాలు
కాదనబోడు...
ఏ ఋష్యశృంగుడైన!
కుంచెతో గీసినా
కవిత లో వ్రాసినా
శిల్పముగ మలచినా
స్త్రీ సౌందర్య రూపిణే!
సౌందర్యమే తనకు శాపమౌనో
త్యాగమే తనను అబలగా జేయునో
ఘన కీర్తి పొందినా ఏలనో ఏమో
సౌందర్యవతి గానే కొనియాడబడతారు!
విద్వత్తునైనా వీరత్వమునైనా
స్త్రీ ప్రతిభ పురుషుని సాటిదేగా...
అసమానతల ఊసెందుకు...
సమతా విపంచిని పలికించేందుకు!
Comments
Post a Comment