అవసరానికి మారదు
అవసరాని మార్చుకునేది
రాజ్యాంగ ధర్మం కావచ్చు
కానీ నైతిక ధర్మం కాకూడదు!
అవసరానికి మార్చుకునేవి
పార్టీ సిద్ధాంతాలు కావచ్చు
కానీ వ్యక్తిగత సిద్ధాంతాలు కాకూడదు!
అవసరానికి మార్చుకునేవి
స్నేహ బంధాలు కావచ్చు
కానీ ఆత్మ బంధాలు కాలేవు!
అవసరానికి మతాన్ని మారగలవు
కానీ దైవాన్ని మార్చలేవు.
రూపాలు వేరైనా దైవం ఒక్కటే!
అవసరానికి బాహ్యములు తప్ప
అంతరాత్మలు మారవు!
Comments
Post a Comment