దైవత్వమే ధర్మం
నువు పూజించే
రామునిది ఏ కులం!
నువు పూజించే
కృష్ణునిది ఏ కులం!
నువు పూజించే
శివునిది ఏ కులం!
నువు పూజించే
శ్రీహరిది ఏ కులం!
నువు పూజించే
శక్తిది ఏ కులం!
నువు పూజించే
హనుమది ఏ కులం!
నువు పూజించే
వెంకన్నది ఏ కులం!
దేమునిలో నీవు
కులబేధం చూడవు!
మనుషులలో మరి
ఎందుకు తేడా చూస్తావు!
కుల బేధం లేదు కనుక
వారు దైవాలైనారు!
బేధాలను ఎంచు నీవు
భక్తుడవంటావా??
దయయే దైవత్వం!
దైవత్వమే ధర్మం!
Comments
Post a Comment