కవులంటే ముద్దు
ఆకాశం విరిగి పడుతున్నట్లు
నేల కృంగిపోతున్నట్లు
సముద్రాలు ముంచెత్తుచున్నట్లు
పర్వతాలు బ్రద్దలైనట్లు
పిడుగులు పడుచున్నట్లు
జడివాన కురుస్తున్నట్లు
పెనుగాలి వీస్తున్నట్లు
నావలా మునుగుతున్నట్లు
స్థంభంలా ఒరుగుతున్నట్లు
ఏమిటా విషాదం...!
కాస్త సంతోషం పంచివ్వరాదూ...!
ఉత్సాహం నింపరాదూ...!
కవిత్వమంటే కాకర కాయ చేదేనా...!
తీపీ..కారం..పులుపు... తెలియద్దూ...!
ఉల్లాసం నింపద్దూ...!
కేరింతలు కొట్టించద్దూ...!
మనసుని ఊగించద్దూ....!
అన్నానని అనుకోవద్దు!
నాకు కవులంటే ముద్దు!
Comments
Post a Comment