మనోభావాలు
మనిషి మనిషికీ మనోభావాలు!
తేడా వస్తే దెబ్బ తింటాయి!
నోటికి అదుపు నేర్పక పోతే...
పెద్దా చిన్నా తేడా చూడరు!
మాంసం తినద్దు అంటే...
మనోభావాలు దెబ్బతింటాయి
మందు తాగద్దు అంటే...
మనోభావాలు దెబ్బతింటాయి
సిగరెట్ బేన్ చెయ్యాలంటే...
మనోభావాలు దెబ్బతింటాయి
నిండుగా బట్టలు వేసుకోమంటే...
మనోభావాలు దెబ్బతింటాయి...
ఫలానా హీరోకి నటన రాదంటే...
మనోభావాలు దెబ్బతింటాయి
మనోభావాలు వారికేనా...?
అవినీతి పరులకీ...
నల్ల కుబేరులకీ...
దోపిడీ దొంగలకీ...
రేపిస్టులకీ
ఫ్యాక్షనిష్టులకీ
టెర్రరిస్టులకీ కూడా
మనసులుండి చచ్చాయి కదా!
కవులకూ కళాకారులకూ
సంయమనం ఉండకపోతే
మనోభావాలు దెబ్బతినేవారితో
తలనొప్పులు తప్పవు కదా!
Comments
Post a Comment