గూటిలోని చిలుక

గుప్పెడూ మనసులో
గొప్ప గొప్ప ఆశలెన్నో
పుట్టుకొని వస్తవి..
ఎన్నో పుట్టుకొని వస్తవి!

నీవి నావనుకునే
భేదాలు ఎన్నో
మొక్కలై నాటుకుని వస్తవి...
మొక్కలై నాటుకుని వస్తవి!

తీరని కోర్కెల తీరాలు తాకుతూ
కలతల కెరటాల హోరు!
మారని మూర్ఖమౌ దారుల సాగుతూ
బయటపడి పోలేని తీరు!

గుండె గడియారము
ముల్లు తిరిగే దాకె
కాలముల లెక్కలుంటాయి!
లెక్క తీరంగానె ఠక్కుమని ఆగుతూ
చిక్కు ముడులన్నియు
త్రెంపబడి పోతాయి!!

గూటిలో చిలుకలు గుట్టుగా చిటికెలో
చెప్పకుండా ఎటకొ ఎగిరి పోతాయి!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు