పరువు కోసం

కులం అంటే భయం
కుల బంధువులంటే భయం
కుల సంకరమంటే భయం
తన ఇంట్లో తప్పు జరిగితే
పరువు కులంలో పోతుందని భయం
పరువుకోసం తమ ప్రాణాలు నైనా
లెక్క చేయరు కొందరు!
పరువు కోసం పిల్లల ప్రాణాలు సైతం
తెగనార్చేది ఇంకొందరు!

కులం, వంశం, కుటుంబ గౌరవం,
ఆస్తులు, అంతస్తులు... తారతమ్యం
మనిషిలోని మంచితనాన్ని చంపేసి
కఠిన పాషాణంగా మారుస్తోంది!

జీవితపు విలువ కన్నా
కట్టుబాట్లకీ ఛాందసత్వానికీ
కట్టుబడి ఉన్న నైజం
కసాయితనాన్ని పెంచుతోంది!
పిల్లల బ్రతుకులు కాలరాసి
కారాగార వాసానికైనా వెనుకాడని
మూర్ఖత్వం వేళ్ళూనుకుంది!!

కట్టబాట్లు మనం ఎలా మార్చుకుంటే
అలా మారిపోతాయి!!
కానీ పోయిన ప్రాణాలను మనం
ఎలా కావాలంటే అలా తేగలమా??

హంతకులుగా ముద్రపడ్డాక
ఇక కులంలో పరువు ఉంటుందా??
పరువు కోసం వెనకాడని
పెద్దలూ...ఆలోచించండి!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు