కూరల్లో రారాజా!
కూరల్లో రారాజా!
నీ కిరీటాన్ని కోసెస్తా!
నిను నిలువుగ సగం చీర్చి
కొత్తిమీర ముద్ద నూర్చి
పచ్చి మిర్చి దంచి చేర్చి
నీ కడుపులోన కూరెస్తా!
బాణాలో నూనె పోసి
సలసలమని కాగించి
నిన్ను మలమల మని మగ్గించి
ఘుమఘుమఘుమ వాసనతో
పొగలు వచ్చుదాక ఉంచి
చింతపండు పిసికేసి
నిన్ను అందు తడిపేసి
అటూఇటూ పొర్లించి
మూత పెట్టి మూకుడులో
పది నిమిషాలలా ఉంచి
వారెవ్వా అనిపించే
వంటకంగ మార్చెస్తా!
రారాజువి నువ్వేనను
మాట నిజం చేసెస్తా!!
Comments
Post a Comment