తెలుగు భాషామృతం

త్యాగరాజ కృతుల
తీయందనాలను
వినితరించవయ్య
తెలుగువాడ!

రామదాసు భక్తి
రసరమ్య కీర్తనలు
ఆలకించవయ్య
తెలుగువాడ!

అన్నమాచార్యుని
భక్తి గేయములన్ని
సేకరించవయ్య
తెలుగువాడ!

పోతనామాత్యుని
భాగవత శోభను
చదివి ముక్తిని పొందు
తెలుగువాడ!

వేమన్న శతకమున
నీతి బోధనలెన్నొ
చదివి నీతిన చనుము
తెలుగువాడ!

తెలుగు నేలపైన
తెలుగువెలుగులు పూచె
దరిశించవయ్య
ఓ తెలుగు వాడ!

ఇంగ్లీషులో నీవు
ఎంత దంచిన గాని
తెలుగు వంటి వడ్ల
రుచిని గనవు!

తెలుగు భాషామృతం
మృతము కానీకుమా
అవనినెల్ల దీని ఘనత నింపు!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు