తెలుగు తల్లి సుతుడను నేను
తేనెలొలికే తెలుగు భాషకు
పుత్రుడై జన్మించినాను
మహాకవులకు పుట్టినిల్లగు
పుడమిపై జన్మించినాను
వాగ్గేయకారుల పుణ్యతలమగు
నేలపై జన్మించినాను
నన్నయ్య తిక్కన ఎర్రప్రగడల
భూమిపై జన్మించినాను
భక్తపోతన రామదాసుల
ధరణిపై జన్మించినాను
వెంకటేశుడు వెలసి వచ్చిన
అవనిపై జన్మించినాను
ఆధునికమున తెలుగు వాంగ్మయ
సొగసు విని తరియించినాను
గద్య పద్యము వ్రాయు మెళకువ
బుద్ధికబ్బక పోయినా...
అబ్బరముగా వ్రాయువారల
మహిన నే జన్మించినాను!!
తెలుగు తల్లికి సుతుని నేనని
గర్వముగ భాసింతు నేను!
Comments
Post a Comment