నానీలు 4 - పొగబతుకు
పొగ నువ్వు
తాగుతున్నావు గానీ
సెగ మాకు
తగులుతోంది
ఇంటి ఇంటికీ
పొగ గొట్టాలు
ఫ్యాక్టరీలన్నీ
దిగదుడుపే
ఇల్లు నల్లబడితే
ఏడుస్తున్నావు గానీ
శ్వాశ తగలబడినా
తెలీదుగా
పొగ పీల్చి
నవ్వుతున్నావ్ సరే
పొగభూతమై
నవ్వుతోంది చూడు
కాలుస్తున్నావు
దర్జాగా సిగరెట్టు
పోతోంది తాపీగా
ఆయువు పట్టు
Comments
Post a Comment