టూత్ పేస్టుల అమ్మకం
వేప పుల్లల బొమ్మ చూపే
పచ్చ పేస్టుల అమ్మకం
నత్త గుల్లల బొమ్మ జూపే
తెల్ల పేస్టుల అమ్మకం
ఝిల్లు ఝిల్లను
జెల్లు పేస్టుల
బిల్లు అదిరే అమ్మకం
ఉప్పు పేస్టులు, చప్ప పేస్టులు
ఘాటు పేస్టులు, స్వీటు పేస్టులు
టేస్టు టేస్టుగ కాస్టు పేస్టులు
కొనేవాళ్ళ కోర్కె తీర్చే
ఖరీదైన అమ్మకం!
డెంటిస్టు డాక్టరు
చెప్పెనంటూ
డప్పుకొట్టీ అమ్మకం
సగం గాలి సగం పేస్టుతొ
జేబుకొట్టే అమ్మకం!
Comments
Post a Comment