తెగేదాకా లాగద్దు

నీ అభిప్రాయం
నాకు నచ్చక పోవచ్చు!
నా అభిప్రాయం
నీకు నచ్చక పోవచ్చు!
అయినా మన ఇద్దరం ఫ్రెండ్స్!
ఎఫ్ బి ఫ్రెండ్స్!!

నా పోస్టు నిన్ను
హర్ట్ చెయ్యచ్చు!
నీ పోస్టు నన్ను
హర్ట్ చెయ్యచ్చు!
అయినా మన ఇద్దరం ఫ్రెండ్స్!
ఎఫ్ బి ఫ్రెండ్స్!!

ఎప్పుడూ నాకు నచ్చిందే
నవ్వు రాయాలని నేనుకోను!
ఎప్పుడూ నీకు నచ్చేవే
నేనూ రాయాలని అనుకోను!!
నీ ఐడియాలజీ నీకున్నట్టే
నా ఐడియాలజీ నాకుంది!

నువ్వు నన్ను మార్చటం జరగదు!
నేను నిన్ను మార్చటం కుదరదు!
నువ్వు నేనూ ఎదురెదురుగా
ఉన్న రెండు తీరాలము!
కొన్ని అభిప్రాయ వంతెనలు
మన ఇద్దరినీ అక్కడక్కడ
కలిపినంత మాత్రాన
ఇద్దరం ఒకటి కానేకాదు!

రెండు ధృవాలను పట్టి ఉంచిన
సెంట్రల్ ఏక్సస్ కాదు
ఈ సోషల్ మీడియా!
గాలి పటానికీ దారపు చుట్టకీ
మధ్య ఉన్న సన్నని
మాంజా పూయని దారం ఇది!
తెగే వరకూ లాగక పోవడం
తెలివైన మన ఇద్దరి మీదా
ఆధారపడి ఉంది మిత్రమా...!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు