మన సంప్రదాయపు వంటలు

అయ్యో మన సంప్రదాయపు
వంటలేమై పోయెనో!
నేతి బూరెలు అరిశ లడ్లు
కానరాకనె పోయెను!
పులిహోర చక్కెర పొంగలెక్కడ
విందు దొరకక పోయెను!

ముద్దపప్పు గుత్తివంకాయ్
పులుసు రుచులే పోయెను!
ముద్దముద్దకు మారు వడ్డన
మురిపెమంతా పోయెను!

డీపు ఫ్రైలు సమోసాలు
మిర్చిబజ్జీ దోశలు
బిరియాని రూమాల్ రోటి తో
పనీరు బట్టరు కూరలు
పిజ్జాలు బర్గర్ కేకులూ
ఫ్రెంచ్ ఫ్రైలు కోక్ లూ

కడుపు అంతా పాడుచేసే
మసాల మంటల విందులు
ఏ పెండ్లికేగిన విందుకేగిన
ఎక్కడ మన వంటలు!
సత్ సంప్రదాయపు వంటలు!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు