చీకటి ముసిరే సమయం
చీకటి ముసిరే సమయం
క్షణాలు గడిచే కొద్దీ...
తల్లి గుండెల్లో భయం...
బయటకు వెళ్ళిన కూతురు
ఇంటికి చేరే సమయం...
రౌడీ మూకలు తప్పతాగి
రోడ్ల పైకి చేరే సమయం...
ఆటోలో వచ్చినా భయం...
క్యాబ్ లో వచ్చినా భయం...
కూతురు తలుపు తట్టే వరకూ...
తలపు వంకే చూస్తూ...
కళ్ళల్లో భయం కాళ్ళల్లో భయం
హృదయం చేసే చప్పుడు...
ఊపిరి వదిలే చప్పుడు...
చెవులు చేటలౌతుంటాయి వినాలని...
కూతురు చేసే తలుపు చప్పడు!
నిత్యం ఇదే భయం...
ఉదయం వెళ్ళిన కూతురు
చీకటి పడినా రాకుంటే...
విలవిలలాడే తల్లి హృదయం...
వినిపించకుండా... విలపిస్తుంది!!
Comments
Post a Comment