నిమిత్తమాత్రులం
ఒకరు ముందు ఒకరు వెనుక
కడుపులో పుట్టి నేలపై పాకి
కాళ్ళతో నడిచి బ్రతుకంతా తిరిగి...
అలిసినా అలవక పోయినా...
నిదురనేది రాకపోయినా...
నిదురపుచ్చే కాలదేవత
కంటిమీదే ఉంటుంది!!
రెప్ప మూసి తెరిచేలోపే
కనురెప్పలు మూయిస్తుంది!
అన్నీ వదిలెయ్యాలి!
జ్ఞాపకాల మూటను కూడా
పుట్టుకతో వచ్చిన ఈ గూడు
పోయినపుడు విడువక తప్పదు
కట్టెగా దీనిని వదిలేసి
కొత్త గూడుకెగరక తప్పదు!
ఈ జననమరణ ప్రక్రియలో
మనమంతా నిమిత్తమాత్రులం!
మరపు అనే మాయాలేపనం
పూయబడిన వసుధ పుత్రులం!
Comments
Post a Comment