పండగ చేద్దాం
ఫెలఫెల ఫెలఫెల
ఉరుముల మెరుపుల
ఘర్జిస్తున్నది ఆకాశం!
ధగధగ ధగధగ
మేఘములన్నియు
నల్లగ మారును మన కోసం!
భగభగ భగభగ
మండే సూర్యుని
మంటలు తగ్గును సంతోషం!
చిటపట చిటపట
చినుకులు కురియగ
చిటికెలొ తగ్గును భూతాపం!
గలగల గలగల
పారును ఏరులు
పంటల నీరిక పరిపుష్టం!
కళకళ కళకళ
చెరువులు బావులు
తాగే ఉదకపు ఉల్లాసం!
చిరుచిరు చిరుచిరు
చిగురులు తొడుగును
తొలకరి ఝల్లుల
మొలకలు మొలియును!
ఎండిన నేలన నదళ్ళనుండి
నాటిన విత్తులు
పొడుచుకు వచ్చును!
బిలబిల బిలబిల
పుట్టల చీమలు
పుడమిన పుట్టిన
పక్షులు పశువులు
ఆనందానికి లేవిక హద్దులు!
కప్పల సందడి, నెమలుల నాట్యం
చూద్దాం రండిక జనులార!
పండగ చేద్దాం మనసార!
Comments
Post a Comment