రైతు సెగ - నానీలు 2
సబ్సిడీ మీద
ఇప్పించేటివి
విత్తనాలా మరి
ఉరి కొయ్యలా!
మిర్చి రైతుకి
మంట ఎక్కితే
ఘాటు కొట్టింది
ప్రభుత్వానికి!
చెరువు కట్ట
తెగి పోయింది
ధర గిట్టక
పోయే సరికి!
అగ్ని శిఖరం
జ్వలించింది
శ్రమ దోచిన
దొంగను చూసి!
తను కొట్టిన
పురుగు మందు
తన దారికి
దిక్కయ్యింది!
Comments
Post a Comment