వినకండి వినకండి

వినకండి వినకండి
వినకూడనివి!!
అనకండి అనకండి
అనకూడనివి!!
చూడకండి చూడకండి
కనకూడనివి!!
పొరపాటున చూసార
ఛూ.. మంతర్ కాళి అంటూ
చెరిపెయ్యండీ!!

విని ఉన్నా కని ఉన్నా
ఎవరైనా అనిఉన్నా
చెడు అన్నది చేటుతెస్తది!
చెవిని చేరి చెదలు పడతది!

వినకండి వినకండి
వినకూడనివి!!
అనకండి అనకండి
అనకూడనివి!!

మనలోన మంచితనం
మసకేసే సమయంలో
చెడు గాలి మదిలో చేరి
మాటు వేయ వస్తుంది!!
కడగలేని కళంకాలని
కసితీరా పులుమేసి
సంఘంలో మన మర్యాద
మంటగలిపి పోతుంది!!

వినకండి వినకండి
వినకూడనివి!!
అనకండి అనకండి
అనకూడనివి!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు