దేహిని
నన్ను నేను తెలుసుకోవాలని
ఎన్నాళ్ళు ప్రయత్నించినా...
ఎక్కడో ఏదో సంశయం!
నేను ఎవరినీ అని...!
పేరు నా రూపానికే అని తెలిసి
పేవలంగా నవ్వాను!
పేరు పెట్టకముందు నన్ను...
పసికందని అన్నారు!
తల్లి కడుపులో ఉన్నపుడు...
పిండం అని అన్నారు!
రేపు నేను మరణిస్తే...
శవం అని అంటారు!
తోలు తిత్తిలోని గాలిలా
ఎటు కలిసిపోతానో గానీ...
దేహంలో ఉన్నంత వరకూ
దేహిగానే మిగిలి పోతాను!!
Comments
Post a Comment