ఆడవారితో షాపింగ్

నేను చేసిన నేరమేమిటి!
నా కెందుకీ శిక్ష !
ఏడ్వలేక నిలుచునే
ఈ దుస్తితి నా కేనా...!
అని మూల నిల్చున్న నా వైపు
దీనంగా చూస్తున్నాడొక వ్యక్తి!
నా కష్టమే అతడి కష్టమూ అని
అతని కళ్ళు చెప్తున్నాయి!
ఈ బట్టల షాపులో
తోడుగా నా కొక బాధితుడు!
ఆడవారితో షాపింగ్ అంటే
ఆటంబాంబు పడినంత
భయం నాకు...!!
నాలుగు గంటల నిరీక్షణ తర్వాత
తీరికగా వచ్చేరు మా ఆడువారు...
వట్టి చేతులతో...
ఆ షాపులో అంత వెరైటీలు లేవని!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు