నా పరీక్ష నేను పాసవుతా!

ఒకడి కుళ్ళు నాకెందుకు
నా కుళ్ళు నే కడుక్కుంటా!
ఒకడి కంపు నాకెందుకు
నేను కంపు కాకుండా ఉంటా!
ఒకడి ఏడ్పు నాకెందుకు
నేను ఏడవకుండా ఉంటా!
ఒకడి మూఢత్వం నాకెందుకు
నేను మూఢుడ్ని కాకుండా ఉంటా!
ఒకడి అసమర్థత నా కెందుకు
నేను సమర్థుడిగా ఉంటా!
ఒకడి ఓటమి నాకెందుకు
నేను గెలుస్తూ ఉంటా!
ఒకడు అహంకారైతే నాకెందుకు!
నేను అహం విడిచి ఉంటా!
ఒకడు చెడ్డవాడైతే నాకెందుకు!
నేను చెడిపోకుండా ఉంటా!
ఒకడ్ని మార్చడానికి నేనెంత
నన్ను నేను మలుచుకుంటూ ఉంటా!
నాకున్న పరిమిత కాలంలో
నా పరీక్ష నేను పాసౌతా!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు