కవిగా ఎదగాలంటే
పదవిన్న్యాసాలు చెయ్యాలంటే...
నిఘంటువు పఠించాల్సిందే!
కావ్యాలు చదవాల్సిందే!
కవుల బాణీలను పట్టాల్సిందే!
పద్యశతకాలు వ్రాయాలంటే...
ఛందస్సు నేర్వాల్సిందే!
పద్య రచనను విశ్లేషించాల్సిందే!
భూమికపై జ్ఞానం పొందాల్సిందే!
చిక్కని కవిత్వం చిలకాలంటే...
భావామృతం అందాల్సిందే!
సమాజాన్ని చదవాల్సిందే!
హృదయ మధనం చేయాల్సిందే!
హాలాహలాలు మింగాల్సిందే!
నవరసాలూ తెలియాల్సిందే!
నవ్యతకై ఎదగాల్సిందే!
కవికి పూర్ణత్వం కావాలంటే...
కవినన్న అహం విడవాల్సిందే!
కవన విహారం చేయాల్సిందే!
సృష్టి స్థితి లయకారుడు కావాల్సిందే!
Comments
Post a Comment