గీత చెప్పిన ధ్యాన యోగము
గీత చెప్పిన ధ్యానయోగము
రోగమన్నది ఎవడురా!
సైన్సు చేయని రోగవ్యాప్తకి
స్థలము ఏదో చెప్పరా!
స్వఛ్ఛమైన గాలి నీరుల
జగతి రూపము మార్చుతూ
కాలుష్యకోరల చిక్కి ఉంచిన
ఘనత ఎవరిదొ చెప్పరా!
గీత చెప్పిన ధ్యాన యోగము
రోగమన్నది ఎవడురా!
రేడియేషను ఓషనందున
ఈదు చేపల బోలుతూ
మనిషిలో ఏవేవొ మార్పులు
చేసిన ఘనులెవరురా!
జీవ రసాయన శోధనంటూ
అంటురోగాలెన్నొ పెంచి
నర జాతి జీవన వనమునంతా
నరకప్రాయము చేసిన
ఆ ఘనులు ఎవరో తెలపరా!
గీత చెప్పిన ధ్యాన యోగము
రోగమన్నది ఎవడురా!
ఆ కూత కూసిందెవడురా!
మనసు పట్టిన మలినమంతా
ధ్యానమందున శుభ్రపరచి
మంచి యోచన పెంచగలిగే
సాధనం ఈ యోగము!
ప్రశాంత చిత్తము పొందగలిగే
మార్గమే ఈ యోగము!
ప్రాణశక్తిని ప్రణవ శక్తిని
అందించు శక్తే యోగము!
గీత చెప్పిన యోగము!
ఆరోగ్యమిచ్చే యోగము!
Comments
Post a Comment