స్నేహ హస్తం
వెన్నుతట్టే వారి
వెన్నంటి నిలువుమా
విజయమే నీదౌను హితుడా...
వెనుపోటు పొడిచేటి
చెలిమి చేయకుమా
ఓటమికి దరిబోకు హితుడా...
పరిచయమ్మయిన
ప్రతి వాని స్నేహములోకి
సులువుగా జారకుమ హితుడా...
బుద్ధి నడవడికలను
పలుమార్లు పరికించి
చేయికలుపుము జతగ హితుడా...
Comments
Post a Comment