వేసవి భర్త

బయటకెళ్తే ఎండ వాత!
లోనికొస్తే ఉక్కపోత!
బయట ఉన్నా లోన ఉన్నా
వళ్ళు తడిసే పోతది!
కుళ్ళు చెమటై వస్తది!
ఆదివారం అయ్యగారికి
బాధ కొత్తగ ఉంటదేమొ!
ఇంటి ఆవిడ వంటి కష్టం
అప్పుడర్థం అవుతది!
ముందు గదిలో వేడి అంటూ
పడక గదికి పరుగు తీసి
ఎ.సి స్విచ్చు ను నొక్కి చూడగ
పవరు పోయిందనుచు తెలిసి
షవరు బాతు ను ఆను చేయగ
వేడి నీళ్ళే కొట్టు పాపం!

ఇంటిలోపలి నరకబాధకు
తల్లడిల్లే నాధుడు
ఆఫీసు ఎంతో పదిలమంటూ
తిట్టుకొనుచూ ఉండుగాని
భార్య చూపే సహనశీలత
తనకు ఉండాలనుకోడుగా!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు