నేటి రాజనీతి
మా ధర్నాలో ధర్మం ఉంది!
ఆళ్ళ ధర్నాలో కుట్ర ఉంది!
మా పోరాటం ప్రజల కోసం!
ఆళ్ళ ఆరాటం పదవికోసం!
మేం అధికారంలోకి వచ్చే వరకూ
జనం తో నిలిచి పోరాడేం!
ఆళ్ళకి అధికారం పోగానే
జనం తో కలిసి కుట్ర జేస్తుండ్రు!
మేం రైతు రాజ్యం చేస్తాం!
రైతుల ఆత్మహత్యలు
ఆళ్ళ గతపాలన నిర్వాకం!
మేం సంకెళ్ళేసిన రైతులు
ఆ పార్టీ రైతులు!
గతంలో మాతో కలసి
ఉద్యమం చేసిన సంఘాలకి
ఏమీ తెల్వదు!!
అందుకే ఇప్పుడు
ఆ పార్టీతో అంటకాగి
ఉద్యమం చేస్తుండ్రు!
ఆళ్ళు ధర్నా జేస్తే
తాట తీస్తాం! నాలుక కోస్తాం!
ప్రజా స్వామ్యాన్ని రక్షించడానికి
ఎన్ని అరెస్టులైనా చేస్తాం!
ఎంతమంది మీదైనా
కేసులు పెట్టి లోపలేస్తాం!
Comments
Post a Comment