సంసార సాధకుడు
నావను నడపాలంటే
తెడ్డు ఒకటి చాలదు
కుడిఎడమల తెడ్లు వేస్తు
గాలి వీచు దశని చూసి
తెరచాప దిశను మారుస్తూ
సులభంగా నడపగలుగు
నావికుడే నాయకుడు!!
సంసారమనే తన నావను
వడిదుడుకుల నన్ని ఓర్చి
సతీ సుతుల సహకారం
సాధనంగ మలచుకుని
సాఫీగా నడప గలుగు
సంసారే సాధకుడు!!
Comments
Post a Comment